Yesayya Katha Davidu Vansanlo - దావీదు వంశంలో
దావీదు వంశంలో- బెత్లేము గ్రామములో
యేసయ్యా జన్మించెను.
యేసయ్య కథ వింటే రక్షణ కలుగును.
మార్గము సత్యం జీవము.
ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం
పరిశుద్ధ దేవుని దివ్య రచితం
నమ్మిన వారికి కలుగును జీవము
పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం.
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హలలెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ.
చరణము
క్రీస్తు జన్మము మార్చింది చరితను
క్రీస్తుశకముగ ప్రారంభము.
చీకటి రాజ్యముకు అంతము కలిగెను
దైవరాజ్యము ఆరంభము. "2"
పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును
మరణచ్చాయలు అంతమగును.
అంతమే లేని జీవమునీకిచ్చును
ఆది అంతము ఆ ప్రభువు.
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హలలెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ.
చరణం
జీవహరమును జీవజలమును నేనే
మంచి కాపరిని నేనన్నాడు
భారమంతయు నాపైన మోపితే
నిత్యం భరియిస్తా నేనన్నాడు"2"
దిగులుచెందకు ఆనందిచు నాలో
నీ స్నేహితుడ నేనన్నాడు
మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే
దేవుని రాజ్యంలో చోటన్నాడు.
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హలలెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ.