1000 praises in Telugu

  1.  అబ్బా తండ్రి    
  2. ప్రేమగల తండ్రి
  3. నిత్యుడగు తండ్రి
  4. పరలోకపు తండ్రి
  5. ఆత్మలకు తండ్రి  
  6. జ్యోతిర్మయుడైన  తండ్రి
  7. కనికరము గల తండ్రి   
  8. మహిమ గల తండ్రి
  9. నన్ను సృష్టించిన తండ్రి
  10. నన్ను పుట్టించిన తండ్రి 
  11. నన్ను స్థాపించిన  తండ్రి 
  12. నా యొక్క, మా యొక్క తండ్రి  
  13. మనకందరికీ తండ్రి
  14. యేసుక్రీస్తు యొక్క తండ్రి 
  15. నీతిగల తండ్రి
  16. రహస్యమందున్న తండ్రి
  17. నీతిమంతుల తండ్రి
  18. ఇశ్రాయేలీయులకు తండ్రి
  19. జీవము గల తండ్రి
  20. మాకు రాజ్యము అనుగ్రహించుటకు ఇష్టమైయున్న తండ్రి
  21. మహోన్నతుడగు దేవా
  22. మహా దేవా 
  23. జీవముగల దేవా
  24. ప్రేమగల దేవా
  25. ప్రేమకు సమాధానమునకు కారకుడైన దేవా
  26. ప్రేమగల దేవా
  27. శాశ్వతుడవైన దేవా 
  28. ఆదరణను అనుగ్రహించు దేవా
  29. ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవా
  30. మహిమ గల దేవా
  31. కృప గల దేవా
  32. కృప చేత నన్ను పిలిచినా దేవా
  33. అబ్రహాము దేవా
  34. ఇస్సాకు దేవా    
  35. యాకోబు దేవా
  36. యెఘారును దేవా 
  37. ఇస్రయేలీయుల  దేవా
  38. ఏలియా దేవా 
  39. దావీదు దేవా
  40. దానియేలుయొక్క దేవా  
  41. షధ్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి దేవా
  42. తండ్రియైన నా దేవా
  43. మా పితరుల దేవా   
  44. నా పితరుల దేవా
  45. కొండలకు దేవా
  46. లోయల యొక్క దేవా
  47. సర్వలోకమునకు దేవా
  48. సర్వాధకారియైన దేవా
  49. లోకమందున్న సకల రాజ్యములకు దేవా
  50. పరలోకమునకు భూలోకమునకు దేవా
  51. పైన ఆకాశమందును కింద భూమి యందును వున్నా దేవా
  52. భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు యాకోబు వంశమును ఎలుచున్న దేవా
  53. అద్భుతములు చేయుదేవా
  54. బలవంతుడవైన దేవా
  55. సర్వశక్తిగల దేవా
  56. సముద్రపొంగు దాని తరంగములను అణిచి వేయుచున్న దేవా
  57. సత్యవంతుడగు దేవా
  58. అద్వితీయ సత్యవంతుడైన దేవా
  59.  తండ్రి అగు ఒక్కడే దేవుడు
  60. అక్ష్యయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి
  61. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవునికి
  62. ఆకాశమందు దేవుడైన యెహోవా
  63. పరిశుద్దమైన దేవా
  64. నమ్మదగిన దేవా
  65. వాగ్దానములు  చేసిన దేవా
  66. నిబంధన చేసిన దేవా
  67. నిరీక్షణ కర్తయగు దేవా
  68. కనికరము గల దేవా
  69. కరుణా సంపన్నుడైన దేవా
  70. నీతికి ఆధారమగు దేవా
  71. ప్రతీకారము చేయు దేవా  ఆయన చర్యలన్నియు న్యాయములు         
  72.  నిర్దోషియై నమ్ముకొనదగిన దేవా
  73. సైన్యములకు అధిపతియగు దేవా
  74. నా దేవా, నా దేవా 
  75. నన్ను కనిన దేవా (నన్ను పుట్టించిన దేవా)
  76. నన్ను చూచుచున్న దేవా
  77. బెతేలు దేవా (దర్శనమిచ్చు దేవా) 
  78. సమస్త శరీర ఆత్మలకు దేవుడైయున్న దేవా 
  79. నిరంతరము స్తుతింప బడుతున్న
  80. శాశ్వత జీవముగల దేవా
  81. నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా
  82. అద్వితీయ ( జ్ఞానము గలదేవా)
  83. మర్మములను బయలు పరచు దేవా
  84. దేవతలకు దేవా
  85. రాజువైన నాదేవా
  86. మహాదేవా
  87. ఐశ్వర్యము గల దేవా
  88. మా అవసరములు తీర్చు దేవా
  89. వృద్ధి కలుగ చేయు దేవా
  90. జయము అనుగ్రహించు దేవా
  91.  సమాధాన కర్తయగు దేవా
  92. అన్యాయము చేయువారిమీద కోపపడు దేవా
  93. రోషము గల దేవా
  94. పాపమును పరిహరించు దేవా
  95. ఆశ్చర్య క్రియలను జరిగించు దేవా
  96. సమస్తమును జరిగించు దేవా
  97. మన రక్షకుడైన దేవునికి
  98.  నా  రక్షణ కర్త, నా  దేవా
  99. ఆనందము, సంతోషము కలుగ చేయు దేవా
  100. శ్రీమంతుడగు దేవా
  101. నాకు పేరు పెట్టి పిలిచినా దేవా
  102. లేనివాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవా
  103. అభద్ధం ఆడజాలని దేవా
  104. నీవు నిన్ను మరుగు పరచుకొను దేవా
  105. మాకు వెలుగు అను గ్రహించు దేవా
  106. మనకు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించు దేవా
  107. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చిన దేవా
  108. నిరంతరమును తరము లన్నిటిని రాజ్యము నేలు దేవా
  109. ఇశ్రాయేలియుల యెడల శుద్ధ హృదయుల యెడల దయాలుడవైన దేవా
  110. సమీపమునకును, దూరమునకు నుండు దేవా
  111. పురాతన కాలము మొదలు కొని ఆసీనుదవైన దేవా
  112. ప్రభువులకు ప్రభువా
  113. ప్రభువైన యెహోవా
  114. సైన్యములకు, అధిపతియైన యెహోవా
  115. సిలోహు ( సమాధాన కర్తయగు ప్రభువా)
  116. రాజులకు ప్రభువా
  117. ఆలోచన కర్తయగు ప్రభువా
  118. మమ్ము స్వస్థ పరచు దేవా
  119.  యెహోవా మహోన్నతుడా
  120. యెహోవావైన పరిశుద్ధ దేవా
  121. యెహోవా పరిశుద్ధపరచు దేవా
  122. న్యాయము తీర్చు యెహోవా
  123. మనకు నీతియగు యెహోవా
  124. నిత్యము వెలుగుగా నుండు యెహోవా
  125. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను
  126. హెబ్రీయుల దేవుడగు యెహోవా 
  127. సహాయము చేయు వాడవైన యెహోవా
  128. నన్ను విమర్శించు ప్రభువా
  129. మీకు ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవా 
  130. ప్రభువే ఆత్మ, మీకు
  131. మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు
  132. యెహోవా గొప్పవాడు బహు కీర్తినీయుడైవున్నాడు
  133. యెహోవా దయాలుడు
  134. మార్పులేని వాడవైన యెహోవా
  135. యదార్ధ వంతుడైన యెహోవా
  136. యెహోవా సత్య దేవా
  137. బలాడ్యువైన యెహోవా
  138. పరలోకపు దేవుడైన యెహోవా
  139. ఆకాశమునకు భుమికి ప్రభువా
  140. సర్వలోకనాథుదగు యెహోవా
  141. మృతులకు సజీవులకు ప్రభువా
  142. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు - ఆయన రాజ్యము తరతరములకు ఉన్నందుకు
  143. రాజువైన యెహోవా
  144. రాజులకు రాజువు ఐన యెహోవా
  145. మహిమ గల రాజ
  146. సర్వభూమికి రాజా
  147. మహా రాజా
  148. యుగములకు రాజా
  149. షాలేము రాజా
  150. నీతికి రాజా
  151. సాత్వికుడైన రాజు 
  152. సకల యుగాములకు రాజా
  153. అక్షయుడవైన రాజా
  154. అద్రుశ్యుడవైన రాజా
  155. యూదుల రాజా
  156.  ఇశ్రాయేలియుల రాజా
  157. యాకోబు రాజా
  158. యెఘారునులో రాజా
  159. పరిశుద్ధ పర్వతము అయిన సీయోను మీద ఆసీనుడైన రాజా
  160. జయ ధ్వనిగల రాజా
  161. రాజులకు ప్రభువా
  162. రాజులకు విజయము దయచేయు వాడా 
  163. భూపతులకు అధిపతియైన వాడా
  164. అధిపతులకు అధిపతియైన వాడా
  165. దేవుడు సర్వభూమికి రాజైయున్నాడు
  166. భూరాజులకు ఆయన భీకరుడు
  167. సమాధనపు రాజా
  168. సమాధనమునకు కారకుడైన వాడా
  169. సమాధాన కర్తయగు దేవా
  170. అధికారుల పొగరును అణుచు వాడా
  171. న్యాయాదిపతులను మాయా స్వరుపులుగా చేయువాడా
  172. యెహోవా నిరంతరము రాజైవున్నాడు
  173. నా రాజా 
  174. పరలోకపు రాజా
  175. సముద్రము నుండి సముద్రము వరకు యుప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఎలును అందుకొరకు
  176. ఆయన రాజ్యము అంతము లేనందుకు
  177. పరిశుద్ధుడు , పరిశుద్ధుడా
  178. అతి పరిశుద్ధమైన వాడా
  179. ఇశ్రాయేలు పరిశుద్ధుడా
  180. దేవుని పరిశుద్ధుడా
  181. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమునకు
  182. పరిశుద్ధుడు నిత్య నివాసియైన వాడా
  183. యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను
  184. నేను మీ మధ్య పరిశుద్ద దేవుడను
  185. పరిశుద్ధను బట్టి మహానీయుడవు
  186. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు
  187. యెహోవా అను నామమునకు
  188. యెహోవా యీరే
  189.  యెహోవా షాలేము
  190. యెహోవా షమ్మా
  191. యెహోవా  నిస్సి
  192. యెహోవా ఈలియాన్
  193. యెహోవా రోహి 
  194. యెహోవా సిటికేను
  195. యెహోవా సబయోతు
  196. యెహోవా మెక్కాదీస్
  197. యెహోవా రెబేకా
  198. యెహోవా ఒసేను
  199. యెహోవా ఎలోహేను
  200. యెహోవా ఏలోగా
  201. యెహొవా ఎలోహే ( యెహొవా నా యొక్క దేవుడు)
  202. ఎలోహిమ్ (అన్ని స్థలములలో వ్యాపించు వాడు )
  203. ఎలిషా డామ్ (సర్వ శక్తి గల దేవుడు )
  204. యేసు అను పేరునకు
  205. యిమ్మానుయేలను పేరునకు
  206. దేవుని వాక్యము అను నామమునకు
  207. ఆయన నామము ఘనమైనది
  208. ఆయన నామము కీర్తిన్చుడి అది మనోహరమైనది
  209. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము
  210. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది
  211. నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామనము ఘనమైనదాయెను
  212. మహిమతో నిండి యుండిన నీ నామమునకు
  213. తన ఘనమైన నామమునకు
  214. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను
  215. సకలాశిర్వచనస్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింప బడును గాక
  216. నీవు (నామము) సమీపముగా ఉన్నందుకు
  217. యహోవా నామము బలమైన దుర్గము
  218. పరిశుద్ధ ఆత్మదేవా
  219. సత్య స్వరూపియగు ఆత్మదేవా
  220. కరుణ నొందించు ఆత్మదేవా
  221. మహిమా స్వరూపియైన ఆత్మదేవా 
  222. జీవమునిచ్చు ఆత్మ దేవా
  223. తండ్రి యొక్క ఆత్మ దేవా
  224. క్రీస్తు యొక్క ఆత్మదేవా
  225. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవా
  226. బలములకు ఆధారమగు ఆత్మదేవా
  227. జీవింపచేయు ఆత్మదేవా
  228. మమ్మును ఓదార్చువాడవైన ఆత్మదేవా
  229. జ్ఞానము గల ఆత్మదేవా
  230. ప్రభువు యొక్క ఆత్మదేవా
  231. ప్రభువగు యెహోవా ఆత్మదేవా
  232. నిత్యుడగు ఆత్మదేవా
  233. సర్వోన్నతుని శక్తియైన ఆత్మదేవా
  234. పరిశుద్ధమైన ఆత్మదేవా
  235. కుమారుని ఆత్మదేవా
  236. దత్తాపుత్రాత్మ అనుదేవా
  237. దయగల ఆత్మదేవా
  238. ఆధరణ కర్తయగు దేవా
  239. విజ్ఞాపన చేయు ఆత్మదేవా
  240. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా ఆపెక్షించునా అను లేకనము నెరవేరినందుకు
  241. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేయు ఆత్మదేవా
  242. మన బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మదేవా
  243. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవా
  244. ఆలోచనలకు ఆధారమగు ఆత్మ దేవా 
  245. ప్రవచన ఆత్మ యగు దేవా
  246. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మదేవా
  247. తీర్పు తీర్చు ఆత్మదేవా
  248. దహించు ఆత్మదేవా
  249. యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనుపోవుప్రవాహ జలముల వాలే ఆయన వచ్చును ప్రవాహము వాలే శత్రువు వచ్చునప్పుడు వానికి విరోధముగా ద్వజమెత్తు ఆత్మ దేవా
  250. అల్పాయు, ఒమెగాయు నేనే
  251. ఆదియు, అంతము నేనే
  252. సృష్టికి, ఆదియునైన వాడా
  253. మొదటివాడను, కడపటి వాడునై ఉన్నవాడా
  254. నేను మొదటివాడను , కడపటి వారితోను వుండువాడను 
  255. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా
  256. నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను
  257. రాబోవుచున్న దేవుడవైన ప్రభువా
  258. ప్రేమా స్వరూపీ
  259. ఉన్నత స్థలములో నివసించువాడా
  260. ఆకాశ మనదలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడా
  261. దేవా శక్తి మంతుడ వై ఘనత వహించిన వాడా
  262. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై వున్నవాడా
  263. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించు కొని యున్నవాడా
  264. మహోన్నతుడా
  265. ఆయన మహోన్నతమైన వాడు
  266. ఆయన అధిక శక్తి గల వాడు
  267. నీవు అతిసుందరుడవై యున్నావు
  268. నీతిమంతుల మార్గము(త్రోవను ) సరాళము చేయువాడా
  269. నీతి సూర్యుడా
  270. న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడా
  271. ఆయన నీతిపరుడు యధార్ధవంతుడు
  272. నీతి ఫలములను వృద్ధి పొందిన్చువాడా
  273. నీతిని న్యాయమును ప్రేమించువాడా
  274. న్యాయమైన సంగతులు యదార్ధమైన సంగతులను తెలియజేయువాడగు యెహోవా
  275. అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలు పరచును
  276. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును
  277. నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని ఉజ్జీవింప జేయును
  278. యెహోవా మన శాసన కర్త
  279. ఆయన తీర్పులు శోదింప నెంతో ఆసక్యములు
  280. దేవుడు నమ్మదగినవాడు
  281. యహోవా వేల్పులలో నీవంటివాడెవ్వడు
  282. నిర్దోషియగు దేవా
  283. నిష్కల్మషుడైన దేవా
  284. నన్ను రక్షించు వాడా
  285. నా కేడమైన దేవా
  286. నా దుర్గము అయిన దేవా
  287. నా ఉన్నత దుర్గమైన దేవా
  288. ఆశ్రయదుర్గమైన దేవా
  289. ఆశ్రయమును దుర్గామునునైన దేవా
  290. నా రక్షణ శృంగము అయిన దేవా
  291. రక్షణ కర్తవైన దేవా
  292. ఆత్మచుక్కాని
  293. నా ప్రాణ ప్రియుడా
  294. ఆత్మ పెండ్లి కుమారుడా
  295. బద్దలైన కొండా (కొండాయే )
  296. లోయలో పుట్టు పద్మము
  297. షారోను పొలములో పూయు పుష్పము
  298. కర్పూరపు పూగుత్తులతో సమానుడా
  299. గోపరసమంత సువాసనగల వాడా
  300. అతడు అతికాంక్షణీయుడు
  301.  పదివేల మంది పురుషులలో గుర్తింపవచ్చును
  302. అతని నోరు అతి మధురము 
  303. నా ప్రియుడు దవళవర్ణుడు రత్నవర్ణుడు 
  304. ప్రకాశమానమైన వేకువ చుక్క 
  305. జల్దరు వృక్షమా 
  306. నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు లేడివలెనున్నానాడు 
  307. కన్యకలు నిన్ను ప్రేమించేదరు 
  308. యధార్ధమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు 
  309. ప్రియ కుమారుడా 
  310. ప్రేమ కుమారుడా 
  311. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా 
  312. పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు 
  313. మనుష్య కుమారుడా 
  314. సంపూర్ణ సిద్ధినొందిన కుమారుడా
  315. దావీదు కుమారుడా
  316. వాక్కు మారని వాడా 
  317. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడా 
  318. ప్రేమ సంపూర్ణుడా 
  319. పరిపూర్ణుడా 
  320. పరిపూర్ణ జ్ఞానము గలవాడా 
  321. ఈ లోకమునకు వెలుగు అయినవాడా
  322. నిజమైన వెలుగు వుండెను వున్నందుకు 
  323. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది
  324. అన్యజనులకు వెలుగై యుండు దేవా 
  325. నమ్మకమైన సాక్షి 
  326. వధింపబడినట్లువుండిన గొర్రెపిల్ల 
  327. దేవుని గొర్రె పిల్ల 
  328. ఒకే కాపరి
  329. గొర్రెల గొప్ప కపరియైన యేసు 
  330. మంచి కాపరి
  331. గొర్రెల కొరకు ప్రాణం పెట్టు వాడా
  332. ప్రధాన కాపరి
  333. ఆత్మల కాపరియు, అధ్యక్షుడైన వాడా 
  334. మన అతిక్రమక్రియలను బట్టి గాయములను నొందిన వాడా
  335. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడా
  336. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడా
  337. మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన వాడా
  338. మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను 
  339. మా కొరకు సిలువలో రక్తము ఛింధించితిరే 
  340. మా సమాదానార్ధమైన శిక్ష వహించిన వాడా
  341. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించిన వాడా
  342. మా కొరకు అపహసింపబడిన వాడా 
  343. నరులచేత నిందింపబడిన వాడా 
  344. ప్రజలచేత తృణీకరింపబడిన వాడా 
  345. అతిక్రమము చేయు వారిలో యెంచబడిన వాడా
  346. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడా
  347. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచ్చున్నందుకు
  348. సమాధిలో నుండి లేచియున్నవాడా
  349. పునరుత్థానమును జీవమును అయిన వాడా 
  350. మార్గము సత్యము జీవము అయిన వాడా
  351. ఆది సంభూతుడా 
  352. ప్రధమ ఫలము అయిన వాడా 
  353. నేనే ద్వారము అని చెప్పిన వాడా
  354. మరణమును జయించిన వాడా
  355. పాతాళమును జయించిన వాడా
  356. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు గలవాడా 
  357. దావీదు తాళపు చెవులు గల వాడా
  358. ఎవడును వేయలేకుండా తీయువాడా
  359. ఎవడును తీయలేకుండా వేయు వాడునైనా వాడా
  360. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే
  361. జీవాహారమును నేనే 
  362. జీవనదియే
  363. జీవ జలముల ఊట
  364. జీవాధిపతియే
  365. ప్రాణములకు, దీర్ఘాయుషుకును మూలమై ఉన్న దేవా 
  366. జీవ వాక్యమా
  367. జీవపు వెలుగా
  368. వెలుగు ప్రచురించు వాడా
  369. రక్షణ శైలమా 
  370. యహోవా నిత్య ఆశ్రయ దుర్గమా
  371. ఆత్మ సంబంధమైన బండ
  372. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గామా 
  373. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా
  374. నా ఆశ్రయ దుర్గమైన నా శైలమా
  375. నేను నిత్యము జొచ్చునట్లు నా ఆశ్రయ దుర్గమా
  376. నా విమోచకుడా 
  377. నాకు సహాయకుడా
  378. నేను నమ్ముకొనిన వాడా
  379. నాకు భర్తయైన వాడా
  380. నన్ను సృష్టించిన వాడా
  381. నా స్నేహితుడా
  382. అతి మనోహరుడవు నా సుందరుడవు
  383. ఆయనే నీకు కీర్తినీయుడు
  384. నా రక్షణయునై యున్నవాడా
  385. ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గమా
  386. యెహోవాయే నా బలము నా గానము
  387. యెహోవా నా ప్రాణ దుర్గమా
  388. నా వెలుగైనా వాడా
  389. నా పరిశుద్ధ దేవా
  390. మరుగైన చోటు వలె నున్న యెహోవా
  391. నాకు అతిశయాస్పధముగా నున్న యెహోవా
  392. ఆయన నాకు కృపా నిధి యగు దేవా
  393. నా మరుగు చోటు నా కేడెము నీవే 
  394. యెహోవా నా స్వాస్త్య భాగము నా పానీయాభాగము
  395. నీవే నా భాగమును కాపాడువాడా
  396. సజీవులున్న భూమి మీద నా స్వస్త్య భాగము నీవే దేవా
  397. చిన్నప్పటి నుండి నీవే నాకు చెలికాడివి ఐనా వాడా
  398. నా యజమానుడా
  399. నా ప్రియుని దానను అతడు నా వాడు
  400. మమ్మును గూర్చి చింతించు వాడా
  401. నా సాక్షి అయిన వాడా
  402. నా ముందర దాటిపోవు వాడా
  403. నా న్యాయ కర్త అయిన వాడా
  404. సర్వ లోకమునకు తీర్పు తీర్చు వాడా
  405. నీతి మంతుడైన యేసు క్రీస్తు
  406. నన్ను బలపరచు యేసుక్రీస్తు
  407. నజరేయుడైన యేసు
  408. యేసు క్రీస్తు అను ఉత్తర వాది
  409. ఆశ్చర్య కరుడా
  410. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము చేయు వాడు 
  411. మా స్నేహితుడా
  412. పాపుల స్నేహితుడా
  413. భక్తి హీనుని నీతిమంతుని గా చేయు వాడా
  414. తీయబడిన ఊటా
  415. నా నిర్ధోషమైన రక్తము కొరకు
  416. నీ నిష్కళంకమైన రక్తము కొరకు
  417. నీ అమూల్యమైన రక్తము కొరకు
  418. ప్రోక్షణ రక్తము కొరకు
  419. మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తము కొరకు 
  420. క్రొత్తనిభంధన నీరక్తము కొరకు
  421. నిత్య నిభంధన సంభందమగు నీరక్తము కొరకు 
  422. దేవుని వరము అయిన యేసుకొరకు
  423. క్రీస్తు అను మా పస్కా 
  424. మా పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడా
  425. దేవునికి నిర్ధోషినిగా అర్పించుకునిన వాడా
  426. మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపైన వాడా
  427. మెస్సియా
  428. మాకంటే ముందుగా మా పక్షమున ప్రవేశించిన వాడా
  429. మరణము వరకు ఆయన మనలను నడిపించును
  430. రబీ, రబ్భూనీ, ప్రభువా, భోదకూడా
  431. యెషయా మొద్ధునుండి చిగురు పుట్టినందుకు
  432. దావీదు చిగురైన వాడా
  433. చిగురు ఆనువాడా 
  434. దావీదు రాజా అని తండ్రి ద్వారా పిలువ బడిన వాడా
  435. నా దాసుడని తండ్రి ద్వారా పిలువబడినా వాడా 
  436. కీర్తి నీయుడైన వాడా
  437. స్తుతుల మధ్య సంతోషపడు వాడా
  438. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అయిన వాడా
  439. స్తోత్రముల మీద ఆసీనుడవైన వాడా
  440. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడా
  441. యెహోవా కెరెబులు మధ్య నివసించు వాడా 
  442. సమీపింపరాని తేజస్సులో నివసించు వాడా
  443. యెరుషలేములో నివసించు యెహోవా
  444. సియోను లో నివసించు యెహోవా
  445. చెరపట్ట బడిన వారి మధ్య నివసించు వాడా
  446. వినయముగలవద్దను దీనమనసుగలవారి వద్దను నివసించువాడా
  447. యెహోవా ప్రియుని భుజముల మీద నివసించు వాడా
  448. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న వాడా
  449. భూమండలము మీద ఆసీనుడవైయున్న వాడా
  450. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన వాడా
  451. ఆకాశమందు ఆసీనుడగు వాడా
  452. యెహోవా పరిశుద్దాలయము లో ఉన్న వాడా
  453. మహా జలముల మీద సంచరించు వాడా
  454. తండ్రి కుడి పార్శ్వములో కూర్చుని ఉన్న వాడా
  455. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు వాడా
  456. యేడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడా
  457. యేడు నక్షత్రములను కుడి చేత పట్టుకునిన వాడా
  458. దయగల వారియడల దయ చూపువాడా  
  459. యధార్ధవంతులకు యధార్ధవంతుడవుగా ఉన్నందుకు
  460. సద్భావము గల వారి యడల సద్భావము చూపువాడా 
  461. మూర్ఖుల యడల నీవు వికటముగా ఉన్నందుకు 
  462. ప్రభువులకు భోదకూడవైన వాడా
  463. దేవుని వద్ధ నుండి వచ్చిన భోదకూడా
  464. ప్రధాన అపోస్తలుడా
  465. ప్రధాన ప్రవక్త
  466. పరమ వైద్యుడా
  467. ప్రధాన యాజకుడా
  468. గొప్ప ప్రధాన యాజకుడా
  469. నిత్య ప్రధాన యాజకుడా
  470. నమ్మకమైన ప్రధాన యాజకుడా
  471. పాపములేని ప్రధాన యాజకుడా
  472. మన బలహీనతల కొరకు సహాయము చేయు ప్రధాన యాజకుడా
  473. రాబోవుచున్న మేలుల విషయమై వచ్చిన ప్రధాన యాజకుడా
  474. మార్పులేని యాజకత్వము కలిగిన వాడా
  475. మెల్కెసెదెకు క్రమము చొప్పున యాజకుడైనవాడా 
  476. ఇశ్రాయేలు సృష్టికర్త
  477. ఇశ్రాయేలు కాపరి
  478. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతియే
  479. ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడా
  480. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా
  481. ఇశ్రాయేలీయులకు ఆధరణమైన వాడా
  482. ఇశ్రాయేలీయుల యొక్క వెలుగైనావాడా
  483. ఇశ్రాయేలుకు మంచువున్నట్లు ఉన్నవాడా
  484. ఇశ్రాయేలుకు మహిమాగా ఉన్నవాడా
  485. ఇశ్రాయేలీయులను పరిశుద్ధ పరచువాడా
  486. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి
  487. ఇశ్రాయేలీయుల బలిస్టుడా
  488. యాకోబు యొక్క బహు పరాక్రమము గలవాడా
  489. యాకోబునకు స్వాస్త్యమగువాడా
  490. యాకోబును ప్రేమించువాడా
  491. యోబును అంగీకరించిన యెహోవా
  492. యోబుక్షేమస్థితిని మరల అతనికి దయచేసిన యెహోవా
  493. యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా కలుగజేసిన యెహోవా
  494. యోబును మొదట ఆశీర్వధించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వధించిన యెహోవా
  495. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించు వాడా
  496. ఆలోచన విషయములో నీవే గొప్ప వాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు
  497. నాకు సహాయము చేయు (కొండా) పర్వతమా
  498. వంకర త్రోవలను చక్కగా చేయువాడా
  499. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా
  500. తండ్రి సన్నిధి దూత అయిన వాడా 
  501. దేవ దూత అయిన వాడా
  502. నిబందనా దూత అయిన వాడా
  503. యెహోవా వలన ఏర్పరుచుకొనిన సేవకుడా 
  504. యెహోవా సేనాధిపతి మీకు 
  505. మా సేనాధిపతి మీకు 
  506. మా పక్షమునున్న దేవా
  507. నరూలకు మధ్యవర్తియైన దేవా
  508. నా సహోదరుడా మీకు
  509. మా అరుణోదయమైన దేవా
  510. మాకు పరిశుద్ధ స్థలముగాయున్న దేవా
  511. మహిమకు స్తోత్రమునకు పాత్రుడా
  512. భూషణ కిరీటముగా యున్నదేవా 
  513. సౌందర్యము గల మకుటముగా యున్న దేవా
  514. శిశువును, కుమారుడు నైనా దేవా 
  515. దయాదాక్షిణ్య పూర్ణుడా మీకు 
  516. బహు వివేచనా శక్తి గలవాడా 
  517. ఆన్యులచేత ఇష్టబడిన (ఆపేక్షించబడిన) వాడా 
  518. అన్యజనులందరికి స్వాస్త్యముగా యున్న దేవా 
  519. అన్యజనులకు స్వస్త్యమునిచ్చిన దేవా
  520. సమస్తమునకు వారసునిగా యున్న దేవా
  521. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు దేవా
  522. గద్ధ రెక్కలతో మోసినట్లు మోయు దేవా
  523. కనుపాప వలె కాపాడుచున్న దేవా
  524. నీ కుడిచేయి చేత నన్ను పట్టుకొనుచున్న దేవా
  525. కుడి పక్కన నీడగా యున్నదేవా
  526. శ్రీమంతుడును, అధ్వితీయుడునగు సర్వాధిపతియగు దేవా
  527. అమరత్వము గల వాడైయున్న దేవా
  528. ఎవడును చూడలేని దేవా
  529. మహిమా తేజస్సుగల దేవా
  530. కడపటి ఆదాము దేవా 
  531. నిజమైన ద్రాక్ష వల్లివైయున్న దేవా
  532. ద్రాక్షతోట వ్యవసాయకూడా 
  533. మంచి విత్తనం విత్తువాడా
  534. ఫలించునట్లు తీగలను శుద్ధి చేయు వాడా 
  535. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన దేవా
  536. ఆటంకములను తొలగింపచేయు దేవా
  537. మా పక్షమున యుద్ధము చేయు దేవా
  538. దహించు అగ్నియైయున్న దేవా
  539. కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడవైయున్న దేవా
  540. భయంకరమైన మహాదేవా
  541. నరుల యడల ఆయన జరిగించు కార్యములకు ఆయన భీకరుడవైయున్న దేవా
  542. సహాయకరమైన కేడమై యున్న దేవా
  543. ఔన్నత్యము కలిగించు ఖడ్గమా  
  544. పరలోకమన్నాయైయున్న దేవా
  545. కుమ్మరి వాడా మీకు
  546. పక్షపాతములేనివాడా 
  547. బహుస్థిరమైన పునాదియైన మూలరాయిగా యున్న దేవా మీకు
  548. పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయినై యున్న దేవా
  549. ఆనందతైలముతో అభిషేకింపబడిన దేవా
  550. దీర్ఘ ఆయుష్యుగల దేవా 
  551. ధీర్ఘశాంతుడైన దేవా మీకు 
  552. దేవునితత్వము యొక్క మూర్తిమంతమైయున్న దేవా
  553. నిష్కళంకమైన వాడా మీకు
  554. సంఘమునకు శిరస్సు నైయున్న దేవా
  555. సంఘమును పోషించి సంరక్షించు వాడా
  556. యూదా గోత్రపు సింహము మీకు 
  557. యుద్ధ శూరుడవైన దేవా
  558. మా కొరకు యుద్ధము చేసే యెహోవా
  559. అధిక బాల సంపన్నుడు మీకు
  560. సాతాను తలను చితుక కొట్టిన దేవా 
  561. జయము పొందిన క్రీస్తు మీకు 
  562. మిగుల అతిశయించి జయించిన దేవా
  563. క్రీస్తునందు విజయోత్సవముతో మమ్మునడిపించు దేవా 
  564. దేవతలందరికంటే పైన మహత్యము గల మహారజా మీకు
  565. సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా
  566. సమస్త దేవతలకు పైన నీవు అత్యాదికమైన ఔన్నత్యము పొందిన దేవా మీకు
  567. సమస్త దేవతల కంటే పూజ్యనీయుడా
  568. సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా
  569. అధిక స్తోత్రములు నొందతగిన వాడా
  570. ఐశ్వర్యవంతుడవైయున్న దేవా
  571. భాగ్యము సంపాధించుకొనుటకు సామర్ధ్యమును కలుగ చేయువాడా
  572. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన వచ్చుచున్నవి దేవా మీకు
  573. ఖైదులోనుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు మీకు
  574. చెరసాలలో వున్న వారి మూల్గులను వినువాడా
  575. బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింపచేయు దేవా
  576. చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవా
  577. యెహోవా పడిపోవు వారిని ఉద్దరించు వాడా
  578. క్రుంగిపోయిన వారీనందరిని లేవనెత్తువాడా
  579. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను కట్టు వాడా
  580. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తు వాడా
  581. నలిగిన వారికి మహా దుర్గమైన వాడా
  582. బాధపడు వారి కోరిక వినువాడా
  583. దీనుల మొరను వినువాడా
  584. దరిద్రులకు న్యాయము తీర్చువాడా
  585. బలముగాల వారి చేతిలో నుంచి దీనులను విడిపించువాడా
  586. దోచుకొను వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడా
  587. బీదలను కటాక్షించువాడు దన్యుడు , ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమిమీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు , రోగశయ్య మీద యెహోవా వానిని స్వస్థపరచుచున్నందుకు దేవా మీకు
  588. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్టులను విరోధివై వారిని అణచివేయువాడా
  589. యెహోవా నీతిక్రియలను జరిపించుచు భాదింపబడు వారికందరికి న్యాయము తీర్చువాడా (దేవా)
  590. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేనివారికి సహాయము చేయువాడా
  591. దరిద్రుల నిట్టూర్పులను బట్టి వారికి రక్షన కలుగచేయువాడా
  592. బీదలకన్నా ధనముగల వారిని ఎక్కువగా చూడని వాడా
  593. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నందుకు
  594. దరిద్రులకు కలిగిన శ్రమలో శరణ్యముగా ఉన్నందుకు
  595. గాలివాన తగులకుండా ఆశ్రయముగా ఉన్నందుకు
  596. వెట్టకలగకుండా నీడగా ఉన్నందుకు
  597. దరిద్రుల మొరను ఆలకించువాడా 
  598. దరిద్రుల భాదను పోగొట్టి వారిని లేవనెత్తు వాడా
  599. దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును విడిపించువాడా
  600. దరిద్రుల వంశమును మందవలె వృద్ధి చేయువాడా
  601. దరిద్రుల వంశమును రక్షించుటకై అతని కుడిప్రక్కన నిలిచియున్న దేవా 
  602. దరిద్రులను పెంటకుప్ప మీద లేవనెత్తు దేవా 
  603. దరిద్రులను ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ పెట్టువాడా
  604. దరిద్రులకు న్యాయము తీర్చువాడా 
  605. తండ్రిలేని వారికి తండ్రియగు దేవా
  606. వెధవరాండ్రకు న్యాయకర్తయైన దేవా
  607. తండ్రిలేని వారికి సహాయకుడైయున్న దేవా
  608. దిక్కులేని దరిద్రుల ప్రార్ధనను నిరాకరింపని దేవా
  609. తండ్రిలేని వారిని వెధవరాండ్రను ఆధరించు దేవా
  610. పరదేశులను కాపాడు దేవా
  611. పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించు దేవా
  612. బందింపబడిన వారిని విడిపించిన వారిని వర్ధిల్లజేయు దేవా
  613. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేయు దేవా
  614. తన సేవకులను బట్టి సంతాపము నొందు దేవా
  615. సేవకుల క్షేమమును చూచి ఆనందించుదేవా
  616. సేవకుల మాట రూఢి పరచు దేవా
  617. నాదూతల ఆలోచన నెరవేర్చు వాడా
  618. తన పరిచారకులను అగ్నిజ్వాలలనుగా చేయువాడా
  619. తన సేవకుల ప్రాణమును విమోచించు దేవా
  620. తన సేవకులను బట్టి ప్రతిదండన చేయు దేవా
  621. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు దేవా
  622. ఒకని నడతను స్థిరపరచు యెహోవా మీకు
  623. నీతిమంతుడగు వాడు పడినను తన చేయితో పట్టుకొని యెహోవా
  624. యధార్ధ హృదయులను రక్షించు దేవా
  625. హృదయములను పరిశీలన చేయు దేవా
  626. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా
  627. నీతిమంతులను పరిశీలించు దేవా
  628. నీతిమంతుల సంతానము పక్షమునున్న దేవా
  629. నీతిమంతులను శ్రమలన్నింటిలో నుండి విడిపించు దేవా
  630. నీతిమంతులకు కలుగు ఆపదలలో నుండి విడిపించు దేవా
  631. నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడు దేవా
  632. నీతిమంతుడు విడువబడుటగాని, వారి సంతానము భిక్షామెత్తుట లేదు దేవా
  633. నీతిమంతులను సంరక్షుడగు దేవా
  634. నీతిమంతులను, కేడెముతో కప్పియున్న దేవా
  635. నీతిమంతుల సహాయకుడైన రక్షించు దేవా
  636. నీతిమంతుని ఎన్నడును కదలనీయని దేవా
  637. నీతిమంతుని ఖర్జూరపు వృక్షమువలె చేయు దేవా
  638. నీతిమంతులను ప్రేమించు యెహోవా
  639. నీతిమంతులు ముసలితనమందు చిగురు పెట్టెదరు సారము కలిగి పచ్చగానుందురు అని చెప్పిన దేవా
  640. యధార్ధ వంతులను తోడైయున్న దేవా
  641. నిర్ధోషుల చర్యలను గుర్తించు యున్న దేవా
  642. యధార్ధముగా ప్రవర్తించు వారికి మేలు చేయు దేవా
  643. దీనులను లేవనెత్తు దేవా
  644. దీనులను రక్షణతో అలంకరించు దేవా
  645. దీనులకు మార్గమును నేర్పుచున్న దేవా
  646. దీనులకు మార్గమును ఉపదేశించు దేవా
  647. మీ యందు భయ భక్తులు గల వారికి మర్మములను తెలుపుచున్న దేవా
  648. వేయి తరముల వరకు నిబంధనను స్థిరపరచువాడై కృప చూపు నమ్మతగిన దేవా
  649. న్యాయము చేయు వాని విడువని దేవా
  650. తమ భక్తులతో శుభ వచనములు సెలవిచ్చు దేవా
  651. తమ భక్తుల ప్రవర్తనను కాచు దేవా
  652. తమ భక్తుల పాదములను తోట్రిల్లకుండా కాపాడు దేవా
  653. పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడవైన దేవా
  654. తమ చుట్టునున్న వారందరి కంటే భయంకరుడవైన దేవా
  655. కేరుబులు, సెరాపులు నిత్యము గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయు చూన్నందుకు మీకు 
  656. నా తల ఎత్తు వాడవుగా నున్న దేవా
  657. గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్మును ఎత్తియున్న దేవా
  658. ఎత్తైన స్థలములలో నను నిలుపుచున్న దేవా
  659. నాకు ఆధారమైయున్న దేవా
  660. నన్ను సురక్షితముగా నివసింపజేయు దేవా
  661. నన్ను ఆదుకొను దేవా, ఆదరించు దేవా
  662. నా దీపమును వెలిగించు దేవా నా చీకటిని వెలుగుగా చేయు దేవా
  663. నాకు చెవులు నిర్మించియున్న దేవా
  664. నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించిన దేవా
  665. నా రోదనా ధ్వని విన్న దేవా
  666. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచిన దేవా
  667. నా కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను తప్పించియున్న దేవా
  668. జారీ పడకుండ నా పాదము తప్పించితివే దేవా
  669. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన దేవా
  670. నా పాదములను వలలో నుండి విడిపించిన దేవా
  671. నా కాళ్ళు చిక్కు పడకుండునట్లు కాపాడిన దేవా
  672. నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయు దేవా
  673. నా చీల మండలు వణకక నా పాదము విశాల పరచితివే దేవా
  674. నా మార్గము యధార్ధ పరచిన దేవా
  675. నా సకల మార్గమునకు అధిపతియైన దేవా
  676. విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన దేవా
  677. నా శత్రువుల చేత నన్ను చెరపట్టనీయక, విశాల స్థలమున నా పాదములు నిలువపెట్టిన దేవా
  678. ఇరుకునందుండి నన్ను విశాల స్థలమునకు తీసుకొని వచ్చిన దేవా
  679. ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించిన దేవా
  680. బలాత్కారుల నుండి నన్ను విడిపించిన దేవా
  681. ఆరు బాధలలో నుండి నన్ను విడిపించి ఏడు బాధలు కలిగినను నాకు ఏ కీడును తగలదు దేవా
  682. కోట గల గొప్ప పట్టణములో నన్ను నడిపించు వాడా
  683. నా చేతులకు యుద్ధము నేర్పిన దేవా
  684. నా చేతులు యుద్ధమును,  నా వ్రేళ్లను పోరాటమును నేర్పిన దేవా మీకు
  685. నా చెయ్యి పట్టుకొని నాకు నడక నేర్పిన దేవా
  686. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుని తప్పించిన దేవా
  687. యుద్ధమున ఖడ్గము బలము నుండి తప్పించు దేవా
  688. యుద్ధ దినమున నా తలను కాచియున్న దేవా
  689. యుద్ధములో నీవు నన్ను బలము ధరింపజేసి నా మీద లేచిన వారిని నా క్రింద అణచిన దేవా
  690. నా మీద లేచినవారు పలుకు మాటలను దినమెల్లవారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు
  691. యెహోవా నాకు కలిగిన అన్యాయమును చూచియున్నావు
  692. నాకు బలము ధరింపజేయుచున్న దేవా
  693. నాకు బలమును నీయమించిన దేవా
  694. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని అందువలన విడువక కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా
  695. నేను నిన్ను ఎరుగకుండి నప్పటికి నీవు నాకు బిరుదులిచ్ఛితివి
  696. నీ సాత్వికము నన్ను గొప్పచేసెను
  697. అన్యజనులకు అధికారిగా చేసితివి దేవా
  698. జనములను నాకు లోపరచిన వాడు ఆయనే
  699. జనములను నాకు వశపరచు దేవా
  700. మన పాదముల క్రింద ప్రజలను అణగ త్రొక్కునట్లు చేసిన దేవా
  701. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివే దేవా 
  702. వాక్కలహము మాన్పి నన్ను కాపాడుచున్న దేవా
  703. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవా
  704. పగ తీర్చుట నా పని నేనే ప్రతి ఫలము నిత్తును
  705. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించిన దేవా మీకు
  706. తన్ను ద్వేషించు వాణి విషయములో ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండ విధించుచున్న దేవా
  707. నా కొరకు పొంచియున్న సంభవించిన దానిని నాకు చూపిన దేవా
  708. నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడియున్నారు దేవా
  709. నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగ జేసిన దేవా
  710. నన్ను చేర్చుకొనుటకు లెక్కకు మించిన సంఖ్యను బలమునకు ఎక్కువైన వారిని వెళ్లగొట్టిన దేవా
  711. బలము గల గొప్ప జనమును మా యెదుట నుండి కొట్టి వేసియున్న దేవా
  712. నీవు నాకు నమ్మిక పుట్టించిన దేవా
  713. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు శాంతకరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్న దేవా
  714. నా ప్రాణమునకు సేద తీర్చుచున్న దేవా
  715. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్న దేవా
  716. గాఢాంధకార లోయలో నీవు నాకు తోడైయున్న దేవా
  717. కారు చీకటిని ఉదయముగా మార్చు దేవా
  718. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచున్న దేవా
  719. నీ దుడ్డు కర్రయు నీ దండకమును నన్ను ఆదరించుచున్నందుకు దేవా మీకు
  720. నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివే నూనెలో నా తల అంటి యున్నందుకు
  721. నా గిన్నె నిండి పొర్లుచున్నది
  722. నేను బ్రతుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చుచున్నందులకై మీకు
  723. నా కన్నుల యెదుట నున్న నీ కృపాకై
  724. నాకు సహాయము కలుగు చూన్నందుకు
  725. నా కాలగతులు నీవశమై యున్నందుకు
  726. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచుచున్న దేవా
  727. మనుష్యుల కాపటోపాయములు వారినంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్న దేవా
  728. నన్ను తప్పించు వాడా మీకు
  729. నీవు నన్ను స్వస్థపరచినందుకై
  730. నన్ను నీవు బ్రతికించినందుకై
  731. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుచున్నందుకై మీకు
  732. నా హృదయమును నిబ్బరముగా నుంచు వాడా
  733. మనుష్యుల యొక్క దుష్టతలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకు మీకు
  734. నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితిరే 
  735. జిగత గల దొంగ ఊబిలో నుండియు నన్ను పైకెత్తి నందులకై
  736. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు వాడా
  737. క్షామ కాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకై
  738. నా ప్రాణమును పాతాళమునుండి లేవదీసినందులకై 
  739. పాతాలపు అగాధమునుండి నా ప్రాణము తప్పించి నందులకై
  740. నా ప్రాణమును మరణమునుండి తప్పించినందులకై
  741. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను దైర్యపరచినందులకై
  742. నా ప్రాణము విషయమై వ్యాజములను వాదించితివే
  743. వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు
  744. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా
  745. జీవమును అనుగ్రహించి సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి
  746. నీ సంరక్షణ చేత నా ప్రాణమును కాపాడుచున్నావు
  747. నీ సంరక్షణ చేత నా శరీరమును కాపాడుచున్నావు
  748. నా అతిక్రమములకు పరిహారము నొందిన వాడా
  749. నా పాపములు మూయబడినందుకు
  750. నా పాపములకు ప్రాయశ్చిత్తము నొందితివే
  751. నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు
  752. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవే పారవేసితివి దేవా
  753. నా దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించితివి
  754. నా దోషములన్నింటిని క్షమించిన వాడా
  755. నా ప్రాణమును విమోచించియున్నాను
  756. కరుణాకటాక్షములను నాకు కిరీటముగా ఉంచియున్నావు
  757. కొత్త తైలముతో నన్ను అంటితివి
  758. మేలుతో నీవు నా హృదయమును తృప్తి పరచుచున్నావు
  759. నా నోట కొత్త గీతమును ఉంచితివి
  760. విమోచన గానములతో నన్ను ఆవరించెదవు
  761. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు
  762. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసియున్నావు
  763. స్నేహ బంధములతో(నన్ను) బంధించి ఆకర్షించితివి
  764. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాను
  765. నన్ను చేర్చుకున్న దేవా
  766. నన్ను ఆదుకొనుచున్న దేవా
  767. నన్ను పుట్టించినది మొదలు కొని నేటివరకు నన్ను ఆదరించి పోషించుచున్న దేవా
  768. దేవుడు నా పక్షముననున్నాడు
  769. పరాక్రమముగల శూరినివలే యెహోవా నాకు తోడై ఉన్నాడు
  770. శూరులలో యెహోవా నాకు సహాయము చేయుచున్నందుకు
  771. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించిన దేవా
  772. నా హృదయవాంఛలను తీర్చుచున్న దేవా
  773. నీ యెడమ చేయి నా తల క్రింద యున్నది నీ కుడి చేత నన్ను కౌగిలించుకున్నావు
  774. నీ కుడి చేయి నీతితో నిండి యున్నది
  775. నన్ను నీతి మంతునిగా చేసితివి
  776. నా నీతిని వెలుగు వలె, మధ్యాహ్నము వలె నీ నిర్ధోషిత్వమును వాళ్ళది పరచును
  777. నా మొక్కుబడులను అంగీకరించినందులకై
  778. నా ప్రార్ధన త్రోసి వేయ లేదు తన కృపను తొలగింప లేదు
  779. కృపతో నన్ను కలుసు కొనిన దేవా
  780. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా
  781. నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి
  782. నాకు కలిగిన యెముకలు నీకు మరుగైయుండలేదు
  783. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను
  784. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైయుంటివి 
  785. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే
  786. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచితివి
  787. బాల్యము నుండి నీవు నాకు భోధించుచు వచ్చితివి
  788. ప్రయోజనకరములైనవి నాకు భోధించుచు వచ్చిన దేవా
  789. నేను నడవ వలసిన త్రోవన నన్ను నడిపించితివి
  790. యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే
  791. నా సంచారములను లెక్కించియున్నావు 
  792. నా గొప్పతనమును వృద్ధి చేయుచు నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుచున్నావు
  793. ఉదయమున నాకు విను బుద్ది పుట్టించుచున్నావు
  794. నాకు ఆధిక్యము కలుగజేయు వాడా
  795. నీ ఆలోచన చేత నన్ను నడిపించేడవు తరువాత మహిమాలో నీవు నన్ను చేర్చుకొందువు
  796. నా పాదము తొట్రిల్లనియ్యడు
  797. నన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు
  798. పగలు ఎండ దెబ్బ అయిను రాత్రి వెన్నెల దెబ్బ అయిను నాకు తగలదు
  799. ఏ అపాయమును కలుగ కుండా యెహోవా నన్ను కాపాడు వాడు
  800. యెహోవా నా ప్రాణమును కాపాడును
  801. నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడును
  802. నా చర్యలన్నింటిని నీవు బాగుగా తెలుసుకొని యున్నావు
  803. నాకు ముందుగా దహించు అగ్ని వలే దాటి పోవుచున్న దేవా
  804. ఆయన నాకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును 
  805. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని యున్నావు 
  806. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి యున్నందుకు 
  807. నా తలంపులు పుట్టక  మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నందుకు 
  808. శిష్యునకు తగిన నోరు నీవు నాకు దయ చేసి యున్నావు 
  809. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే యున్నందుకు 
  810. నా నడకను, నా పడకను నీవు పరిశీలనా చేసి యున్నావు 
  811. నేను ఆపదలో చిక్కు బడినప్పుడు నీవు నన్ను బ్రతికించితివి
  812. నాలో నా ప్రాణము క్రుంగి యున్నప్పుడు నా మార్గము నాకు తెలిపితివి
  813. వెనుకకు, ముందుకు నీవు నన్ను ఆవరించి యున్నందుకు 
  814. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నన్ను శిక్షించుచున్న యెహోవా 
  815. యెహోవా నన్ను కఠినము గా శిక్షించను గాని నన్ను మరణమునకు అప్పగించలేదు 
  816. విరోదుల పండ్లకు వేటగా అప్పగించని యెహోవా
  817. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి 
  818. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుమని చెప్పినందుకు 
  819. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటికై
  820.  నా గుమ్మముల గడియలను బలపరచి యున్నాడు నా మధ్యనున్న పిల్లలను ఆశీర్వదించి యున్నావు
  821. నా సరిహద్దులలో సమాధానము కలుగజేయు చున్నావు 
  822. నన్ను విడిపించుటకు నా శత్రువులను నాకు అప్పగించుటకు నా పాళెములో సంచరించుచున్నందుకు
  823. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి కొండ తేనెతో నన్ను తృప్తి పరచుచున్నందుకు 
  824. మనోబీష్టము వాలే సఫలము చేయుచున్నావు
  825. మన దీన దశ లో నున్నప్పుడు మమ్ములను జ్ఞాపకము చేసికొన్న దేవా
  826. మమ్మును  మరచిపోలేని దేవా 
  827. మమ్మును  లేపి చక్కగా నిలువ బెట్టిన దేవా
  828. మమ్మును నిలువు గా నడువ చేసిన దేవా
  829. ఇంతకు ముందు వెళ్ళని త్రోవ నేను రక్షితముగా దాటిపోవునట్లు చేయుచున్న దేవా 
  830. నీ సన్నిధిని సంతోషమును మమ్మును ఉల్లాశింపజేయుచున్నావు
  831. నీ ఆనంద ప్రవాహములో నీవు నన్ను త్రాగించుచున్నావు
  832. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుచున్నావు
  833. మా శత్రువులను అనుగ త్రొక్కుచున్నావు
  834. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించి మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచు వాడవు నీవే
  835. వెండిని నిర్మలము చేయు రీతి మమ్మును నిర్మలము చేయుచున్నావు
  836. మా కాడి పలుపులను తెంపు దేవా
  837. తన యందు భయ భక్తులు కలిగిన పిన్నలనేమి పెద్ధలనేమి ఆశీర్వదించు  దేవా
  838. ఇశ్రాయేలియులను ఆశీర్వదించు దేవా
  839. అహరోను వంశస్తులను ఆశీర్వదించు దేవా
  840. భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మేము ఆశీర్వదింపబడితిమి
  841. యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ది పొందించుచున్నందుకు
  842. నీ సేవకుని కుమారులు నిలిచియుందురు
  843. నీ సేవకుని సంతతి నీ సన్నిధిలో స్థిరపరచబడును
  844. నీ యందు భయ భక్తులు కలవారికి నీ కృప యుగ యుగములు నిలుచును
  845. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తులుగల వారికి ఆయన కృప అంత అధికముగానుండును
  846. తండ్రి తన కుమారుల యెడల జాలి పడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును
  847. మా పాపముల బట్టి మాకు ప్రతిఫలమియ్యక మా దోషములను బట్టి మాకు ప్రతిఫలమియ్యకయున్నందుకై
  848. పడమటికి తూర్పు యెంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నందుకు
  849. నిజముగా నీవు మా పక్షమునుండి మా పనులన్నింటిని సఫలపరచుచున్నందుకు
  850. తన ప్రజలకు బల పరాక్రమమును అనుగ్రహించుచున్నందుకు
  851. తన ప్రజలకు సమాధానమును కలుగజేసి ఆశీర్వదించుచున్నందులకు
  852. యెహోవా తన ప్రజల గాయము కత్తి వారి దెబ్బలు బాగుచేయు దేవా
  853. యెహోవా తన ప్రజలయందు ప్రీతిగల దేవా
  854. తన ప్రజలకు ఒక శృంగామును హెచ్చించినందుకై
  855. యెహోవా తన మందను దర్శించి వారిని అశ్వముల వంటి వారీగా చేయుచున్నావు
  856. తన ప్రజలను మంద వలె నడిపించుచున్న దేవా
  857. యెహోవా స్వరము బలమైనది
  858. యహోవా స్వరము ప్రభావము గలది
  859. యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును
  860. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును
  861. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది
  862. యెహోవా స్వరము లేళ్ళను ఈనచేయును
  863. నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి మాకు విజయమును కలుగజేయును
  864. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నందుకు
  865. నీ ముఖకాంతికై
  866. దుష్టమృగములుండు పర్వతము సౌదార్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అందుకై 
  867. భూమ్యాకాశముల అంతట నున్న వాడవు
  868. సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతయైయున్న దేవా
  869. అలసియున్న వారి ఆశను తృప్తి పరచెదువు, కృశించిన వారినందరిని నింపుచున్న దేవా
  870. తన అభిశక్తునకు రక్షణ దుర్గమునై యున్న దేవా
  871. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయు దేవా
  872. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును
  873. హృదములనుఏకరీతిగా నిర్మించిన దేవా
  874. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన దేవా మీకు
  875. మనుష్యుల యోచనాలు వారికి తెలియచేయు వాడు ఆయనే అందుకొరకు
  876. మనుషులందరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చుచున్న దేవా
  877. యెహోవా యందు భయభక్తులు గలవారి  చుట్టూ ఆయన్ దూత కావాలియుండి వారిని రక్షించు దేవా
  878. నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్త్యము నీవు నాకు అనుగ్రహించియున్నందులకై
  879. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు - నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును
  880. నీవే కార్యము నెరవేర్చు వాడవు
  881. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను
  882. ప్రార్ధన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కాబట్టి
  883. నీకు ఆసాద్యమైనది ఏదియు లేదు
  884. దేని కాలమందు అధి చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నీయమించియున్నాడు
  885. ఆయన చెప్పిన యే మాటాయు నిరర్ధకము కాలేదు
  886. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము 
  887. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడెను
  888. ప్రతి మోకాలును,  నీ యెదుట వంగును. ప్రతి నాలుకాయు దేవుని స్తుతించును
  889. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది
  890. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండియున్నది
  891. నీవు భూతలమును నూతన పరచుచున్నావు
  892. దేవా భూమిని దర్శించి తడుపుచున్నావు 
  893. దేవుని నది నీళ్ళతో నిండియున్నది
  894. భూమి మొలకెత్తగా నీవి దాని నాశీర్వదించుచున్నావు
  895. భూమిని యెహోవా కృపతో నింపియున్నాడు
  896. భూమికి దాని సరిహద్దులను నీయమించిన వాడవు నీవే
  897. భూదిగంతులను సృజించిన దేవా
  898. ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టుకొని, భూమి యందు పునాదులను వేయు వాడవు నీవే
  899. భూలోకమును కదలకుండా స్థిరపరచుచున్నావు 
  900. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునోంనొందెననుటకు నాకు కలిగిన శ్రమయే కారణము 
  901. మీ సంవత్సరముల సంఖ్య మితి లేనిది ప్రభువా
  902. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు ప్రభువా
  903. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి
  904. నీ యొద్ద జీవ జలపు ఊట కలదు ప్రభువా
  905. నీ న్యాయవిధులు మహా గాధములు ప్రభువా
  906. నీ ఆలోచనలు అతిగంభీరములు ప్రభువా
  907. ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము ప్రభువా 
  908. నీ మహత్యము గ్రహింప శఖ్యము కాదు ప్రభువా 
  909. ఎవడును తెలిసికొనలేని మహతైన కార్యములను, లెక్క లేనన్ని అధ్బుత క్రియలను చేయు దేవా 
  910. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
  911. నీ జ్ఞానము శోదించుటకు అసాధ్యము ప్రభువా
  912. నీ మార్గములు అగన్యములు ప్రభువా 
  913. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభువా 
  914. నీ చర్యలన్నియు న్యాయములు, అవి యధార్ధమైనవి ప్రభువా
  915. మీ నీతి పర్వతములకు సమానము 
  916. భూమ్యాకాశములకు పైగా యున్న నీ ప్రభావము కొరకై 
  917. నీ కృప ఆకాసమును అంటుచున్నది 
  918. నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది దేవా 
  919. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించదరు 
  920. దేవుని రధములు సహస్రములు సహస్ర సహస్రములు
  921. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు 
  922. అరణ్యములో వాహనమెక్కి ప్రయాణము చేయు దేవా 
  923. తెరను పరచునట్లు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు 
  924. నక్షత్రముల సంఖ్య నీయమించి యున్నావు 
  925. నక్షత్రములను మరగు పరచుచున్న దేవా
  926. భక్తులను శోధన లో నుండి తప్పించు దేవా మీకు
  927. శిక్ష లో యున్నవారిని తీర్పు తీర్చు దినము వరకు కావలి లో ఉంచుటకు సమర్డుడా
  928. మా హృదయము కంటె అధికుడై సమస్తమును ఎరిగి యున్న దేవా 
  929. యోనా కంటే గొప్పవాడా
  930. సొలోమోను కంటే గొప్పవాడా
  931. అందరి కంటే గొప్ప వాడా 
  932. దేవాలయము కంటే గొప్ప వాడా 
  933. సీయోను లో యెహోవా మహోన్నతుడు
  934. మాలోయున్న వాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు 
  935. మీ జ్ఞానము మితిలేదు
  936. మీ దయ ఎంతో గొప్పది గా ఉన్నందుకు
  937. మీ సౌoదర్యము ఎంతో గొప్పదిగా ఉన్నందుకు 
  938. నీవు ఎంతైనా నమ్మతగిన వాడవు ప్రభువా
  939. యెహోవా మహాకృప గల వాడి యున్నాడు
  940. మీ యొక్క ప్రభావము మహా గొప్పది గా ఉన్నందుకు
  941. నీవు చూపిన కృప అధికమై యున్నది
  942. పగటి వేళ తన కృపను కలుగ నాజ్ఞాపించుచున్నాడు 
  943.  నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రభువా 
  944. కృపను ఘనతయును అనుగ్రహించు దేవా
  945. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది
  946. దేవా నీ కృప నిత్యముండును
  947. మేము నిర్మూలము కాకున్నది మీ కృపయే దేవా 
  948. అనుదినము నూతనము గా అయన వాత్సల్యత పుట్టుచున్నది
  949. కరుణా, కటాక్షములను కిరీటముగా ఉంచియున్నావు దేవా 
  950. అంతము లేని మీ కృప కొరకు
  951. నీవు చేసిన ఉపకారములన్నింటి కొరకు 
  952. ప్రభువా నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు
  953. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు
  954. వస్త్రము వలె వెలుగును నీవు కట్టుకొని యున్నావు దేవా 
  955. నీతిని కవచముగా ధరించి యున్నదేవా
  956. రక్షణను శిరస్త్రానముగా ధరించుకొనెను 
  957. ప్రతిదండనను వస్త్రముగా వేసికోనిన దేవా
  958. ఆసక్తిని పై వస్థ్రముగా ధరించుకోనినవాడా
  959. రెండంచులు ఖడ్గము గలవాడా 
  960. వాయువులను తనకు దూతలుగా చేసికొన్న దేవా
  961. ఆశగల ప్రాణమును తృప్తి పరచియున్నాడు 
  962. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు 
  963. తన వాక్కు పంపి బాగుచేయు దేవా
  964. నా బాధలో నీ వాక్యము నెమ్మది కలిగించిన దేవా 
  965. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులున్నందుకై 
  966. నీ మాట వలన నిరీక్షన పుట్టించితివే 
  967. నీ వాక్యము నన్ను బ్రతికించెను దేవా
  968. యెహోవా నీ మాట చొప్పున మేలుచేసితివి, చేయుదువు, చేయుచున్నావు
  969. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది
  970. నీ వాక్యము తెలివిలేని వారికి తెలివి కలిగించును 
  971.  నీ మాట మిక్కిలి స్వచ్చమైనది
  972. నీ మాట సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నందుకు
  973. యధార్ధముగా ప్రవర్తించు వారికి నీ మాటలు క్షేమ సాధనములు 
  974. నీ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై యున్నందుకు
  975. నీ వాక్యము సజీవమై బలముగలదై యున్నందుకు
  976. నీ మాట అగ్ని వంటిది బండలు బద్దలు చేయు సుత్తె వంటిది
  977. నీ నోటి మాట అగ్ని గాను చేసి యున్నావు
  978.  యెహోవా వాక్యము యదార్ధమైనది ఆయన చేయునది అంతయు నమ్మకమైనదియై యున్నది
  979. నీ ధర్మోపదేశము అపరిమితమైనది
  980. నీతిని బట్టి భీకర క్రియలను చేయ మాకు ఉత్తరమిచుచున్నావు,యిచ్చియున్నావు,యివ్వబోవుచున్నావు
  981. నీతిని బట్టి ఉత్తరమిచ్చుచున్నావు 
  982. మీ కోపము నిమిషమాత్రము మీ దయ ఆయుష్కాలమంతయు నిలిచి యుండును 
  983. ఎల్లపుడు వ్యాజ్యమాడు వాడు కాదు ఆయన నిత్యమును కోపించు వాడు కాడు 
  984. నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును గనుక మీకు
  985. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరకును గనుక మీకు
  986. నీ రక్షణ నిమితము నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా
  987. ఆకాశం విశాలము సృజించిన వాడవు నీవే గనుక
  988. ప్రపంచములను నిర్మించిన వాడవు నీవే కనుక
  989. భూమ్యాకాశములను సృజించినవాడా మీకు
  990.  వెలుగును కలుగ జేసినా వాడా మీకు 
  991. ఆకశ  విశాలమును సముద్రములో ఉప్పును కలుగజేసిన వాడా మీకు 
  992. పుష్పములు, ఫలములు,దినుసులు,కాయలు,ఆకుకూరలు వీటి కొరకు వీటి నిచ్చు చెట్లు, వ్రుక్షములు, తీగెలు కొరకు
  993. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల కొరకు 
  994. జల చరములు, మృగములు, పక్షులు,చేపల  కొరకు 
  995.  పక్షులు, ఊరు ప్రాణులు, జంతువులు, అడవి మృగముల కొరకు
  996. మట్టితో మనుష్యుని సృజించి వాని నాసికా రంద్రములో జీవపు వాయువును ఊది తగిన జత నిర్మించిన వాడా 
  997. నీవు నిర్ణయించిన కాలము కొరకు, వర్షము కొరకు ఎండ కొరకు, గాలి కొరకు ఉత్తర వాయువు కొరకు
  998. నదుల కొరకు, వాగుల కొరకు, చెరువుల కొరకు కోనేటి కొరకు మీకు
  999. కొండల కొరకు, మెట్టల కొరకు, లోయల కొరకు, గుట్టల కొరకు, మైదానము కొరకు, బీట భూముల కొరకు, శీతోష్ణప్రదేశముల కొరకును ప్రభువా
  1000. అడవుల కొరకు, గుహల కొరకు, నీటి మడుగుల కొరకు, జల ఊటల కొరకు, ఉప్పొంగు జల ఊటలకోరకు, మందు వాయువు ఈ ప్రకృతి  అన్నింటిని కృపతో నింపి నందులకై యెహోవా నామమునకే
1000 praises in Telugu



Post a Comment (0)
Previous Post Next Post