స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి - Sthuthiyu
Song Lyrics:
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి
వితతికిన్ కర్తవై వెలయు మా దేవా
ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు
హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు||
1.నెమ్మదిగల యేండ్లు నిజ సౌఖ్య కాలములు
ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్
ఇమ్ముగ గలిగిన హృదయులమై వందనమ్ములు
ఋణపడియున్నాము నీకు ||స్తుతియు||
2.జీవంబు ప్రేమను జీవను గల్గించెడు
పావనాత్మను మాకై పంపితివి
దీవెన లేడు రెట్లావరింపను మమ్ము
నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు ||స్తుతియు||